“రెండు సంవత్సరాల క్రితం, జీవితంలో ఏం చేయాలో నాకు స్పష్టత లేదు. అప్పుడే నా హై స్కూల్ చదువు పూర్తయ్యింది. మాది సాంప్రదాయ కుటుంబం. హై స్కూల్ తరువాత, నేను ఇంటర్మీడియేట్ చదువుతానని మా ఇంట్లో వాళ్ళు అనుకున్నారు. నాకు వేరే ఆలోచనలు ఉన్నాయి. నెలాఖరు వచ్చేసరికి, మా కుటుంబం ఇబ్బంది పడటం నేను గమనించాను. అందుకనే, ఏదైనా టెక్నీకల్ కోర్సు చేయాలని నిర్ణయించుకున్నాను. ఏదైనా కోర్సు చేసి, వెంటనే పనిలో చేరాలనేది నా ఆశ. 10వ తరగతి తరువాత, ఇంజనీరింగ్ లో డిప్లొమా లో చేరాను. నా ఖాళీ సమయంలో, సోడా వ్యాపారంలో అమ్మ కి సహాయం చేసేవాడ్ని.
మా నాన్న ఆటో డ్రైవర్.ఈ వయసులోనే పనిచేయడం మా ఇంట్లో వాళ్ళకి నచ్చట్లేదు.. కుటుంబానికి సహాయం చేయడం, కుటుంబంలోని సభ్యులందరి బాధ్యత. అందుకే, నేను చదువుకుంటూ, ఖాళీ సమయంలో పని చేస్తున్నాను.
అమ్మ, నాన్న, నేను పని చేస్తున్నాం కాబట్టి, నెల ఖర్చులు వెళ్ళిపోతున్నాయి.
భవిష్యత్తు లొ ఇంజనీరింగ్ కి సంబంధించిన చిన్నకారు వ్యాపారం ప్రారంభించాలని నా కల. అవసరంలో ఉన్న వాళ్ళందరికీ పని కల్పించాలి. దాని కోసం ఇప్పటి నుంచే నెను డబ్బులు పోగు చేస్తున్నాను.”