“ఇరవై సంవత్సరాల క్రితం నేను ఆటో-డ్రైవర్ గా నా పయనం కొనసాగించాను. అప్పుడు నాకున్న ఆలోచన ఒకటే, వివిధ నగరాలకు చెందిన రకరకాల మనుషులను కలవచ్చు, ఒకచోటుకి మాత్రమే పరిమితం అయ్యే అవకాశం లేదు.మంచి రాబడి సంపాదిస్తూ, కస్టమర్లని అందమైన రాజమహేంద్రవరం అంతా తిప్పుతూ, వాళ్ళకి సంతోషాన్ని పంచవచ్చు.దేవుడి దయవల్ల, నా అంచనా నిజం అయ్యింది.
నేను సైన్స్ గ్రాడ్యువేట్ ని, అయినా కూడా ఈ డ్రైవింగ్ జాబ్ అనే నాకు ఇష్టం. మా ఊరులో, ప్రభుత్వ కాలేజీలో చదువుకున్నాను. అయినా కూడా, రాజమహేంద్రవరం వచ్చి, ఆటో తోలడానికి నిశ్చయించుకున్నాను.
ఒకసారి, యుఎస్ నుంచి వచ్చిన 50 సంవత్సరాలు పైబడిన ఫారిన్ జంట నా దగ్గరికి వచ్చి రాజామహేంద్రవరం, కాకినాడ సైట్ సీయింగ్ కి తీసుకెళ్ళమని అడిగారు. ఉదయం అనగా మా ప్రయాణం మొదలుపెట్టి, గుళ్ళు, పుష్కర్ ఘాట్, బీచ్, నగరంలోని ఫుడ్ జాయింట్స్ అన్నీ తిరిగాము. నాకు వచ్చీ రాని ఇంగ్లీష్ లో నేను వాళ్లతో మాట్లాడటానికి ప్రయత్నించాను. నా ప్రయత్నం మా అందరికీ సంతోషాన్ని కలిగించింది. కానీ ఆ ట్రిప్ ని మేము అసలు మర్చిపోలేము. ఇలాంటి సందర్భాల్లో నేను ఆలోచించేది ఒకటే. భాష తెలియని వాళ్ళు ఉరికి వస్తే, మన సంస్కృతి గొప్పతనాన్ని వాళ్లకి తెలియచేయాలి. నా దృష్టిలో ఆటో అంటే, నా జీవనాధారం మాత్రమే కాదు, సంతోషంగా ఉండటానికి ఒక మార్గం కూడా!”