“నాకు కొత్త ప్రదేశాలు దర్శించడమంటే ఇష్టం. పెళ్ళికాక ముందు, నేను బాగా ప్రయాణం చేసివాడ్ని. సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాక, నా బాధ్యతలు పెరిగాయి, పని ఒత్తిడి పెరిగింది. అప్పుడప్పుడూ వెకేషన్స్ లో ఫామిలీ ట్రిప్స్ కి వెళ్తాము కోవిడ్-19 మహమ్మారి వల్ల, పరిస్థితులు ఇంతకు ముందులా లేవు. దీని వల్ల, ప్రయాణం పట్ల నాకుండే ఇష్టాన్ని కోల్పోతున్న అనుభూతి కలిగింది! అన్నిటి నుంచి, ఒక విరామం కావాలనిపించింది. అందుకని, నా స్నేహితుడ్ని, ఒక సర్ప్రైజ్ ట్రిప్ కి ఆహ్వానించాను. ఒకవారం రోజులు, రెండు తెలుగు రాష్ట్రాలు ప్రయాణించాలనిపించింది. ఇంతకు ముందు, నేనిలా ఎప్పుడూ ప్రయాణించలేదు.
ఈ విషయం మా స్నేహితుడికి చెప్తే, వాడు కూడా చాలా సంతోషపడ్డాడు. మేము కొన్ని గంటలు మాత్రమే మాట్లాడుకున్నాం. వెంటనే, మా ప్రయాణానికి ఏర్పాట్లు, షాపింగ్, ప్యాకింగ్ వెంటనే ప్రారంభమయ్యాయి. మేము వైజాగ్ కి ఎంతో ఉత్సాహంతో బయలుదేరాము. అదృష్టవశాత్తూ, చల్లని వాతావరణాన్ని ఆస్వాదించే సరైన సమయంలోనే అక్కడికి వెళ్ళాం. లంబసింగి లో మంచు చూసినప్పుడు, నా స్నేహితుడి కళ్ళలో కలిగిన ఆనందం నాకు ఇప్పటికీ గుర్తు. మా జీవితంలో అది ఒక ఆనందకరమైన సందర్భాల్లో ఒకటి. అక్కడి పరిస్థితులకి అలవాటు పడటానికి కొద్దిగా సమయం పట్టింది. కానీ, ఆ మాత్రం కష్టపడచ్చు అనిపించింది. లంబసింగి వంటి ప్రదేశాలు నేను మళ్ళీ చూస్తానో లేదో నాకు తెలీదు. కానీ, కొత్త ప్రదేశాలకోసం మాత్రం నా వేట మొదలయ్యింది. కొత్త ట్రిప్ ఎప్పుడు మొదలుపెట్టాలా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నాను. కానీ, ఈ సారి మా కుటుంబంతో కలిసి ప్రయాణం చేస్తాను. మా అమ్మ కూడా కొత్త ప్రదేశాలు చూడాలి!”