“మా కుటుంబం, చాలా కాలం నుంచి వైద్య రంగంలో ఉంది. మా అమ్మ గారు, ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సు గా పనిచేస్తారు.మన దేశం విడిచి, ఫిలిప్పైన్స్ లో ఎంబీబీఎస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనకి తెలియని దేశంలో, స్వతంత్రంగా నివసించడం, ఒక థ్రిల్లింగ్ అనుభూతి.
నేను ఇప్పుడు ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్నాను. ఎవరూ, ఏంటీ ఏమీ తెలియని దేశానికి వెళ్ళడానికి మొదట్లో, నేను, నా కుటుంబం కిడఁడుగా వెనకాడామూ. ఇదంతా నిన్న జరిగినట్టుగా అనిపిస్తుంది. డాక్టర్ అయ్యి, ప్రజలకి సేవ చేయాలనే నా ఆశని నెరవేర్చడానికి మా కుటుంబం చాలా కష్టపడింది. ఆ కష్టాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను.
నేను జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదురుకున్నాను. కానీ నా సంకల్పాన్ని, స్థైర్యాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. చెప్తే నమ్మరు, నా కంఫర్ట్ జోన్ దాటి, కొత్త వాతావరణంలో అడుగుపెట్టినప్పుడు గగుర్పాటు కలిగింది. ఆ పరిసరాలకు అలవాటు పడటానికి కొద్దిగా సమయం పట్టింది.ఎలాంటి అవరోధాలు ఎదురైనా, నా కలని సాధిచగలనని నేను బలంగా నమ్మాను.”