“మేము ఇరుగుపొరుగు వాళ్ళం, మంచి మిత్రులం కూడా. దాదాపు ప్రతిరోజూ, మేమిద్దరం కలిసి సైకిల్ తొక్కుతాం. మేము ఇప్పుడు రెండవ తరగతి చదువుతున్నాం. ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయి కాబట్టి, మేము పొద్దున్న పూట సైకిల్ తొక్కుతున్నాం. ఇంతకు ముందు, మేము స్కూల్ అయిపోయాక, సాయంత్రం పూట సైకిల్ తొక్కేవాళ్ళం. డాక్టర్ అవ్వాలని నా కల. వీడికి మాత్రం ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని ఉంది. బాగా చదువుకొని, పేద ప్రజలకి ఉచితంగా వైద్యం చేయాలని ఉంది.మాకు క్రికెట్ ఆడటమంటే ఇష్టం. మాకు ఎంఎస్ ధోని అంటే ప్రాణం.ధోని హెలికాఫ్టర్ షాట్, వికెట్ కీపింగ్ మాకు బాగా ఇష్టం. కెప్టెన్ కూల్ తప్ప, మాకు ఏ ఆటగాడూ నచ్చరు.మాలో ఎవరికి కష్టం వచ్చినా, వేరే వాళ్ళు సహాయం చేసుకుంటాం. మమ్మల్ని ఏడిపించే అవకాశం మేము ఎవరికీ ఇవ్వము. మేము తోడు దొంగలం. కొన్ని సాహసాలు చేసినా కూడా, దొరక్కుండా చూసుకుంటాం.పెరిగాక కూడా, మేము మంచి మిత్రులుగా ఉండాలనుకుంటున్నాం.”