“నాకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి, ఈ పళ్ళ బండి లాగుతున్నాను. బాగా చదువుకుని, జీవితంలో మంచి స్థానంలో ఉండాలని అనుకున్నాను. కానీ, ఇంట్లో పరిస్థితుల దృష్ట్యా, మా కుటుంబానికి నా అవసరం పడింది. నేను ఈ వృత్తిలోకి వచ్చి దాదాపు 18 సంవత్సరాలు అయ్యింది. ఈ పని నాకు బాగా నచ్చింది. మా పళ్ళ బండి యజమాని నా పని పట్ల సంతోషంగా ఉన్నారు. నాకొచ్చే రాబడితో, మా కుటుంబాన్ని బాగానే చూసుకోగలుగుతున్నాను. లాక్డౌన్ సమయంలో మేము పెద్దగా కష్టపడలేదు. దీనికి ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలపాలి.
నా 15 సంవత్సరాల వయసులో, క్షయ వ్యాధితో మా నాన్న చనిపోయారు. ఆయన ఎక్కువగా ధూమపానం చేసేవారు. మా నాన్న వల్ల మేము ఓ పాఠం నేర్చుకున్నాం. ధూమపానం వ్యసనం వల్ల మా నాన్న చనిపోవడం చూసిన నాకు, మా సోదరుడికీ సిగరెట్ల మీద విరక్తి కలిగింది.
నా దగ్గరికి వచ్చే కస్టమర్లకు సిగరెట్లకు దూరంగా ఉండమని సలహా ఇస్తాను. పరోక్ష ధూమపానానికి కూడా దూరంగా ఉండమని చెప్తా. కుటుంబ సభ్యులు దూరమడవం వల్ల కలిగే బాధ చాలా తీవ్రంగా ఉంటుంది. దాని ప్రభావం చాలా ప్రాణాల మీద పడుతుంది. ఇలాంటి వ్యసనాల వల్ల ప్రాణ నష్టం కలగకుండా చూసుకుందాం.”