“దీపావళి పండగ దగ్గరికి వచ్చేసింది. పండగ కోసం నేను ఆత్రంగా ఎదురుచూస్తున్నాను. నాన్న పనితో బిజీగా ఉంటారు. కాబట్టి, దీపావళి జరుపుకునేది నేను, అమ్మ మాత్రమే. దీపావళి టపాసులు పర్యావరణానికి మంచివి కాదని అందరూ అంటున్నారు. అందుకని ఎక్కువ టపాసులు కొనకూడదూ అని నిర్ణయించుకున్నాను. నేను ఈ సారి పండక్కి చిచ్చు బుడ్లు, కాకరపూవొత్తులు కాలుస్తాను. అవంటే నాకు చాలా ఇష్టం!”