“దాదాపు 57 సంవత్సరాల క్రితం, నేను టీనేజ్ లో ఉన్నప్పుడు శ్రీకాకుళం నుంచి విజయవాడ వలస వచ్చాను.మాది పేద వ్యవసాయ కుటుంబం. మాకు ఒక పూట భోజనం దొరకడమే గగనం. మేము ఆరుగురం తోబుట్టువులం. ఆరుగురిలో ఇద్దరు, ఆరోగ్య సమస్యల వల్ల చనిపోయారు. ఇంట్లో ఆర్థిక సమస్యల వల్ల , కుటుంబానికి చేదోడుగా ఉండాల్సిన పరిస్థితి. దాంతో, రోజుకూలీగా మారాను.పరిస్థితి ఎక్కడి దాకా వెళ్ళిందంటే, మాకున్న మూడు ఎకరాలు, కేవలం 6,000 రూపాయలకి అమ్మేయాల్సి వచ్చింది. అది చాలా తక్కువ ధర.
నేను ఈ పని చేయడం మొదలుపెట్టి దాదాపు 50 సంవత్సరాలు పైనే అయ్యింది. నేను రోజూ ఇంటి నుంచి ఉదయం 4 గంటలకు బయలుదేరుతాను. గోడౌన్ కి వెళ్ళి, దాదాపు 80-100 కిలోల సరకు వెనక సీట్లో కట్టుకుని డీలర్స్ దగ్గరికి తీసుకుని వెళ్తాను. అలా రోజంతా సైకిల్ తొక్కితే, నాకు దాదాపు 200-300 సంపాదిస్తాను. మొన్నీమధ్యే మా ఆవిడ కాలుకి ప్రమాదం జరిగింది. నా సేవింగ్స్ అన్నీ ఆమె వైద్యానికే వాడేశాను. ఇప్పుడే నాకొచ్చే సంపాదనతోనే, ఖర్చు పెట్టిన డబ్బులు మళ్ళీ పోగు చేయాలి.
మా ఇంట్లో పరిస్థితుల వల్ల, స్కూల్ కి వెళ్ళలేకపోయినందుకు నేను ఇప్పటికీ బాధపడుతున్నాను. దాని వల్ల, ఈ ప్రపంచంలో, జీవించడం చాలా కష్టతరం చేసింది. దురదృష్టవశాత్తూ, మాకు ఇది తప్ప వేరే మార్గం లేదు!”