“నా చిన్నతనంలో నాకు తెలిసిన దీపావళి వేడుకలు ఇప్పటితో పోలిస్తే పూర్తిగా మారిపోయాయి. మాకు దీపావళి అంటే మరపురాని పండగ. కొత్త బట్టల దగ్గర నుంచి, బహుమతులు, ఇంట్లో తయారు చేసే ఆహార పదార్థాల వరకూ అన్నీ సస్పెన్స్ గా ఉంచేవారు.
ఆ రోజుల్లో అంటే ఇప్పటి లాగా ఉండేది కాదు. దీపావళి వంటి ప్రత్యేకమైన సందర్భాలలో తల్లిదండ్రులు ఏం కొన్నారో తెలుసుకోవడానికి ఆత్రంగా ఎదురుచూడటం తప్ప వేరే మార్గమా ఉండేది కాదు.
నా చిన్నతనంలో కొబ్బరి, తాటాకులతో ఎకో-ఫ్రెండ్లీ క్రాకర్స్ తయారుచేసేవాళ్ళం. పండగ రోజు సాయంత్రం అందరం ఊరేగింపులో పాల్గొని ఆహారం అందరితో పంచుకునేవాళ్ళం.
ఎలక్ట్రానిక్ దీపాల దగ్గర నుంచి, టపాసుల దాకా అన్నీ రెడీ మేడ్ వి దొరకడంతో అసలు పండగ కళే పోయినట్టుంది
ఆ రోజుల్ల, పండక్కి బయట నుంచి స్వీట్లు కొనడం చాలా అరుదు. ఆడవాళ్లు ఇళ్ళలోనే స్వీట్లు చేసి, స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకునేవారు. మా దృష్టిలో దీపావళి అంటే ఇంట్లో ఉండి, బంధువులతో సమయం గడుపుతూ అందరినీ సంతోషంగా ఉంచడమే.
కానీ ఇప్పుడు పండగ కళే తప్పింది. పండుగని సాంప్రదాయంగా జరుపుకునే సమయమే లేదు ఇప్పుడు. అసలు ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలే కరువయ్యాయి. పండుగలు కూడా చాలా బోరింగ్ గా తయారయ్యాయి. అవకాశం దొరికితే, మళ్ళీ ఆ పాత రోజులకి తిరిగి వెళ్ళాలని ఉంది!”