“నవరాత్రి తో మొదలైన పండగ సీజన్ సంక్రాంతి వరకూ కొనసాగుతుంది. మధ్యలో దీపావళి వస్తుంది. చెడు మీద మంచి సాధించిన గెలుపుకి గుర్తుగా దీపావళి జరుపుకుంటాం. దానికి గుర్తుగానే దీపాలు వెలిగిస్తాం. దీపాలు మన జీవితంలో అంధకారాన్ని ప్రాలదోరుతుంది
ఒకప్పుడు, అంటే వెండి ధర తక్కువగా ఉన్నప్పుడు, మా నాన్న గారు వెండి గ్లాసులు, ఉంగరాలు ఇచ్చేవారు దీపావళికి. దీపావళి ఆర్డర్లు సమయానికి పూర్తయ్యేలా కష్టపడి పనిచేసే మా వర్కర్లకు బోనస్లు, స్వీట్లు, టపాసులు అందిస్తున్నాము.
రెడీ మేడ్ బట్టలు రావడంతో కుట్టిచ్చిన బట్టలకు అంతగా గిరాకీ ఉండదని అందరూ అనుకుంటారు. ఎన్ని ట్రెండ్స్ వచ్చినా పండక్కి బట్టలు కుట్టిచ్చే ట్రెండ్ మాత్రం ఎప్పటికీ పోదు.మాకు నవరాత్రి, దీపావళికి ఎక్కువ ఆర్డర్లు వస్తాయి. పని చేస్తూ, మేము పండగ జరుపుకుంటాము.
దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను ఈ వ్యాపారంలో ఉన్నాను. అప్పటితో పోలిస్తే, ఇప్పుడు పండుగలు ఎక్కువగా జరుపుకుంటున్నారు. పట్టణం నలుమూలల నుంచి మా షాప్ కి వస్తారు.బట్టలు తీసుకుని వెళ్ళేటప్పుడు మాకు ప్రసాదం కూడా ఇస్తారు.నా దృష్టిలో పండగలు అంటే ప్రజలను ఏకం చేయడం అలాగే కుటుంబం అంతా కలిసి జరుపుకోవడమే. అందరికీ దీపావళి శుభాకాంక్షలు!”