“మాది ఎనిమిది మంది సభ్యులున్న కుటుంబం. మా కుటుంబం ఆర్థికంగా అంత కలిగిన కుటుంబం కాదు. మా అమ్మగారు మొక్కజొన్న అమ్మేవారు, నాన్న గోడౌన్ లో సామాన్లు మోసేవారు. నా చిన్నతనం అంతా ఇలాగే కష్టాలు, కన్నీళ్ళే చూశాను.
అదృష్టవశాత్తూ, అవేవీ నా మీద చెడు ప్రభావం చూపలేదు. ఆ కష్టాలు చూడటం వల్ల జీవితం పట్ల మరింత బాధ్యత కలిగింది. పెద్దయ్యాక కూడా, నా జీవితం అంత సాఫీగా సాగలేదు. 19 సంవత్సరాల వయసులో, నా జీవిత భాగస్వామిని కలిశాను. అంత చిన్న వయసులో భాగస్వామిని కలవడం తప్పు కాదు. కానీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలను ఒకటిగా తీసుకోవాల్సి వస్తుంది. అయినా కూడా, మేము ఒకరి మాట ఒకరు వింటూ, పెళ్ళికి ముందే ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. కొన్నికొన్ని సార్లు ఆర్థికపరమైన ఖర్చులు సమకూర్చుకోవడానికి, ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి కొద్దిగా కష్టపడ్డాం. ఇన్ని కష్టాల మధ్య కూడా మా మధ్య ప్రేమ తగ్గలేదు. అప్పట్లో, నేను ఇంకా చదువుకుంటూ ఉండేవాడిని. బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తుయి చేసిన తరువాత, ఎన్నో ఉద్యోగాలు ప్రయత్నించి చివరికి రియల్ ఎస్టేట్ వ్యాపారం లో అడుగుపెట్టాను.
ఈ ప్రక్రియలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి.అయినా కూడా ధైర్యంగా కష్టాలను ఎదురుకున్నా. దీనికి కారణం ఏంటంటే చిన్నప్పుడ, నేను ఎన్నో కష్టాలను ఎదురుకున్నా కాబట్టి.
ప్రస్తుతం నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పనిచేస్తున్నాను. పెట్టుబడులు పెట్టడం దగ్గర నుంచి, మారుతున్న పోకడలను అన్వయించుకోవడం వరకూ, ఎన్నో కష్టాలు పడి ఈ వ్యాపారాన్ని ప్రారంభించాము.
నా చిన్నతనం తో పోలిస్తే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా మారిపోయింది. ఆ రోజుల్లోడబ్బుకి ఎంతో విలువ ఉండేది. మనుషుల మధ్య నమ్మకోసం కూడా ఉండేది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నా విలువలు నేను పాటిస్తాను. బ్రతుకుదెరువు కోసం నేను ఎన్నో పనులు చేశాను. కానీ, నేనెప్పుడూ మా క్లయింట్లని మోసం చేయలేదు.
మనం చేసే పని పట్ల నిజాయితీగా ఉండటమే, జీవితానికి అర్థాన్ని ప్రసాదిస్తుంది.”