“నాకు సైకిల్ తొక్కడం రాదు. అందుకే సైక్లింగ్ అంటే నాకు పడదు. నేను 3వ తరగతిలో ఉన్నప్పుడు మా నాన్న సైకిల్ నడపడం నేర్పారు. ఇంట్లో సరుకులు తేవడానికి, మార్కెట్ కి సైకిల్ మీదే వెళ్ళేవాడిని. ఎవరి సహాయం లేకుండా సైకిల్ తొక్కినప్పుడు, ఏదో చెప్పలేని సంతోషం కలిగింది. ఇంతకు ముందెప్పుడూ నాకు ఈ అనుభూతు కలగలేదు. పలు మార్గాల్లో సైకిల్ నడపడం అంటే నాకు ఇష్టం. కొన్ని సార్లు అదే పనిగా సైకిల్ మీద దూర ప్రయాణాలు చేస్తాను. అలాంటి రూట్లలో, కొండపల్లి కోటికి వెళ్ళే ఘాట్ రోడ్డు అంటే నాకు ఇష్టం. ఆ దారిలో చల్లని గాలి, అందమైన ప్రక్రుతి ఆహ్లాదపరుస్తాయి.కృష్ణానదిని దగ్గర నుంచి చూడగలిగే ప్రకాశం బ్యారేజ్ దారి కూడా ఇష్టమే. కొండపల్లి రూట్ నచ్చడానికి ఇంకొక కారణం ఏంటంటే, నేను, నా స్నేహితుడు కలిసి వెళ్ళాం కాబట్టి. కొండపల్లి కోట కి వెళ్ళాలనుకుని, రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక పల్లెటూరి దగ్గర ఆగిపోయాము. ఆ రోజు 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం సైకిల్ మీద వెళ్ళాము. ఆ ప్రయాణం నాకు బాగా నచ్చింది. ఆశ్చర్యం ఏంటంటే , అన్ని కిలోమీటర్లు వెళ్లినా నాకు శ్రమ అనిపించలేదు. కాని నాన్న తో మాత్రం తన్నులు తిన్నాను.”
![](https://humansofandhra.org/wp-content/uploads/2020/07/FB_IMG_1594299987402-970x728.jpg)