టీం హెచ్ఓఏ: హలో. ఏం చేస్తున్నావ్?
షఫియా: ఒంటరిగా ఆడుకుంటున్నా.ఇంతకూ ముందు మా నాన్నతో బాగా ఆడుకునేదాన్నీ కానీ, ఇప్పుడు కాదు. నాన్నని మిస్ అవుతున్నాను.
టీం హెచ్ఓఏ: ఓహో. ఇప్పుడు మీ నాన్న ఎక్కడున్నారు?
షఫియా: నాన్న పనిలో బిజీ గా ఉంటారు. ఈ మధ్య ఇంటికే రావట్లేదు.
టీం హెచ్ఓఏ:ఓహ్. అలాగా. ఇంతకీ మీ నాన్న ఏం చేస్తుంటారు?
షఫియా: నాన్న సంజయ్ గాంధీ హాస్పిటల్ లో నర్సింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. ఆయన 16 రోజులకి ఒకసారి మాత్రమే ఇంటికి వస్తారు.
టీం హెచ్ఓఏ: అరెరే. మీ నాన్న 16 రోజులకి ఒకసారి మాత్రమే ఎందుకు వస్తున్నారు?
షఫియా: ఏమో నాకు తెలీదు. నేను, అమ్మ వీడియో కాల్ చేసినప్పుడు మాత్రం కోవిడ్ డ్యూటీ లో ఉన్నా అని చెప్తారు.
![](https://humansofandhra.org/wp-content/uploads/2020/07/IMG-20200512-WA0038-01-1.jpeg)
టీం హెచ్ఓఏ: సరే. ఈ సారి మీ నాన్న ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తావ్?
షఫియా: హైడ్ అండ్ సీక్, సీ సా, హార్స్ రైడింగ్ ఇంకా చాలా ఆటలు ఆడతా. నాన్న ఇంటికి వస్తే బోలెడు చాకోలెట్లు, కుకీలు తెస్తారు. నేను వాటినన్నిటినీ తింటాను. దానికంటే ముందు నా చేతులు శుభ్రంగా కడుక్కుంటాను.
టీం హెచ్ఓఏ: అవునా. చేతులు శుభ్రం చేసుకోవడం అంత ముఖ్యమా?
షఫియా: అవును!. అది చాలా అవసరం. బయటికి వెళ్ళేటప్పుడు, పేస్ మాస్క్ వేసుకోమని, శానిటైజర్ కూడా ఉంచుకోమని నాన్న ఎప్పుడూ చెప్తారు. కరోనా నుంచి సురక్షితంగా ఉండటానికి నేను ఈ జాగ్రత్తలు అన్నీ పాటిస్తాను.