టీం హెచ్ఓఏ: హాయ్. ఇక్కడ ఏం చేస్తున్నావ్?
రాజు: నేను జూమ్ జూమ్ అని ఉయ్యాల ఊగుతున్నా.
టీం హెచ్ఓఏ: బాగుంది. ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నావ్ ?
రాజు: ఊరికే ఇంట్లో ఉండి ఆడుకుంటున్నాను. అది నాకు నచ్చట్లేదు.
టీం హెచ్ఓఏ: అవునా… ఎందుకు?
రాజు: వేసవి సెలవులకి నానమ్మ వాళ్ళ ఊరు తీసుకుని వెళ్తానని నాన్న చెప్పారు. చెప్పారు కానీ, తీసుకువెళ్ళలేదు.
టీం హెచ్ఓఏ: ఓకే. నీకు ప్రయాణం అంటే ఇష్టమా?
రాజు: అవును. నాకు ప్రయాణం అంటే ఇష్టం. కానీ నాన్న మాత్రం నన్ను ఎక్కడికీ తీసుకునివెళ్ళట్లేదు.
టీం హెచ్ఓఏ: ఇది బాధ కలిగించే విషయమే. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు?
రాజు: పైకి… పైపైకి ఎగరాలనుకుంటున్నా. ఎంత ఎత్తుకంటే, పక్షి లాగా నేను కూడా గాల్లో ఎగిరేంత ఎత్తు. నాకు ఎగిరే శక్తి వచ్చిందంటే, నచ్చిన చోటుకి ఎగురుకుంటూ వెళతా. అప్పుడు మాత్రం మా నాన్నని నాతో పాటు తీసుకెళ్ళను.