“చిన్నప్పుడు అమ్మా నాన్న, టీచర్లు తిట్టినా కూడా కొత్త విషయాలు ప్రయత్నించడం ఆపేవాడ్ని కాదు. ఆ అలవాటు నాతోపాటే పెరిగి పెద్దదయింది. సేంద్రియ వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం. అందుకనే, అగ్రికల్చర్ ఏకమనిక్స్ లో మాస్టర్స్ చేసిన తరువాత రెండు సంవత్సరాల పాటు, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉండే గిరిజన ప్రజలతో కలిసి సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు నేర్చుకున్నాను. సహజ వ్యవసాయం లో ఉండే కష్టాలు, వాళ్ళ జీవనశైలి తెలుసుకోవడానికి అక్కడ చాలా మంది స్థానిక రైతులతో మాట్లాడా. చిరు ధాన్యాలు ఆరోగ్యానికి మంచిదని ఇక్కడే తెలుసుకున్నా. అందుకే వాటిని, బియ్యం కంటే ఆగోగ్యమైన ఎంపిక లాగానే కాకుండా, రుచికరమైన ఎంపిక లా కూడా ప్రచారం చేయాలని నిశ్చయించుకున్నా.
చిరుధాన్యాలతో చేసిన భోజనం అందించాలని అనుకున్నప్పుడు, ఎవరూ ముందుకు రాలేదు. వేరే వాళ్ళ దాకా ఎందుకు, మా ఇంట్లో వాళ్ళే వాటిని తినడానికి ఒప్పుకోలేదు. అవి మెతకగా ఉండడమే వాళ్ళకి నచ్చలేదు. అందుకని, వాటికుండే రుచి పోకుండా, చిరు ధాన్యాలతో రకరకాల రెసిపీలు ప్రయత్నించేవాడ్ని. ప్రత్యేకమైన ఆహార పద్దతిని అందించాలనే ఉద్దేశంతో, కస్టమ్-మేడ్ ఇడ్లీలు తయారుచేయాలని నిర్ణయించుకున్నాను. చిరుధాన్యాలతో చేసే ఇడ్లీలు తయారుచేయడం కోసం, గుంటూరు లోని ఆచార్య నాగార్జున రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తో కలిసి పనిచేశాను.
ఆ తరువాత, 50,000 పెట్టుబడితో ‘వసేనా పోలి ‘ పేరుతొ విశాఖపట్నం లో ఒక స్టాల్ ప్రారంభించా. వసేనా పోలి అంటే తెలుగులో ఇడ్లీ అని అర్థం. మార్చి వరకు వ్యాపారం మెల్లిగా సాగుతున్న సమయంలో, లాక్డౌన్ వల్ల నష్టాలు వచ్చాయి. ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో, పది రోజుల క్రితమే షాప్ మళ్ళీ ప్రారంభించాను. దేశంలో మరింత మంది వినియోగదారులకి చేరువవ్వడానికి, ఈ మధ్యనే కొత్తగా పిండి మిక్స్ వ్యాపారం మొదలుపెట్టాం. ఇప్పటి వరకూ అంట సాఫీగా ఏమి లేదు. కానీ ఇంతవరకు నన్ను నమ్మి, నన్ను ప్రోత్సహించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.”