“కుటుంబానికంటే ఎక్కువ ఇతరుల మీద ఎక్కువ శ్రద్ధ చూపుతానని మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది.ఆమె అలా చెప్పడానికి కారణం లేకపోలేదు, అమ్మ ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఆసుపత్రిలో రోగులకి చికిత్స అందిస్తూ బిజీ గా ఉంటాను. దీని వల్ల నేను ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించనని, అన్నిటికంటే నాకు పనే ముఖ్యమని అమ్మ అనుకుంటుంది. ఇది చేసేది వాళ్ళ కోసమే అని, రోగులకు సేవ చేయడమే నాకు సంతోషాన్ని కలిగిస్తుంది అని అమ్మకి అర్థం అయ్యేలా ఎలా చెప్పాలి?
మాది ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల. నేను సాంప్రదాయ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. మాది చాలా పెద్ద కుటుంబం, మా అమ్మా నాన్న, ఆరుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కాచెల్లెల్లు.
కాలేజీ చదువు పూర్తయ్యాక, ఢిల్లీలో రెండేళ్ళ పాటు పబ్లిక్ హెల్త్ నర్స్ గా రెండేళ్ళు పనిచేశాను. ఆ తరువాత, సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ లోని నెఫ్రాలజీ వార్డ్ లో నర్సింగ్ ఆఫీసర్ గా లక్నో లో ఉద్యోగం లభించడంతో, నా భార్య, కూతురు తో లక్నో వచ్చాను.
కోవిడ్-19 వ్యాప్తి కారణంగా నాకు ఐసోలేషన్ వార్డ్ లో డ్యూటీ వేశారు.కొవిడ్-19 పాజిటివ్ రోగులకి, అనుమానిత రోజులకి దగ్గరగా ఉండాల్సి వస్తుంది.
నేను ఐసోలేషన్ వార్డ్ లో పని చేయడం మొదట్లో మా ఇంట్లో వాళ్ళకి నచ్చలేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక బాధ్యతాయుత నర్సింగ్ ఆఫీసర్ గా పూర్తి నిబద్దతతో పనిచేయాలి, అందుకే ఇవన్నీ పక్కన పెట్టి పని మీద శ్రద్ధ పెడతా. మేము మెడికల్ వార్డ్ లో చేసే 12 గంటల షిఫ్ట్ తో పోలిస్తే, ఐసోలేషన్ వార్డ్ లో 6 గంటల షిఫ్ట్ ఎంతో కష్టం ఎందుకంటే మాకు అసలు విరామమే ఉండదు కాబట్టి.
ఐసోలేషన్ వార్డ్ లోకి అడుగుపెట్టే ముందు మేము హజ్మత్ సూట్లు, ఎన్95 మాస్కులు ధరిస్తాం. ఇవి ధరించడం వల్ల ఊపిరాడదు కాబట్టి, చాలా అసౌకర్యంగా ఉంటుంది. సూట్ ధరించాక, ముఖాన్ని ముట్టుకోకుండా, చర్మాన్ని తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.షిఫ్ట్ పూర్తయ్యాక, సూట్లని జాగ్రత్తగ తొలగించి, బయో మెడికల్ వేస్ట్ బాగ్స్ లో ఉంచుతాం. తరువాత శుభ్రంగా స్నానం చేస్తాం కూడా. మేము సూట్స్ తొలగించాక, అటెండర్ మా దుస్తులు ఇస్తారు. ఏడు రోజులు షిఫ్ట్స్ పూర్తి చేశాక, 14 రోజుల పాటు సెల్ఫ్-ఐసోలేషన్ వార్డ్స్ లో ఉంటాము. పదిహేనవ రోజున, మాకు నెగిటివ్ వస్తేనే మేము ఇంటికి వెళ్ళడానికి అనుమతిస్తారు.
ప్రతిరోజూ ఒక సవాలే. కోవిడ్-19 వార్డ్ లో పని చేయడం వల్ల నాకు తెలిసింది, ఈ ప్రపంచంలో ఉండటానికి నేను ఎంత అదృష్టవంతుడనో. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన ఇతరుల పట్ల మానవత్వాన్ని చూపమని అందరినీ అడుగుతున్నాను. ఏదీ శాశ్వతం కాదు, త్వరలోనే మనం ఈ పరిస్థితిని అధిగమించగలం!”