నేను వైజాగ్ బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ (బిట్స్) లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ని.ఎల్ జీ పాలిమర్స్ ప్లాంట్ లో గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. ఈ దుర్ఘటన జరిగిన రోజు తెల్లారుఝామునే వైజాగ్ వాసులు, పరిస్థితిని అర్థం చేసుకుని ఆర్ ఆర్ వెంకటాపురం దగ్గరగా ఉండే ప్రాంతాల నుండి సురక్షిత గ్రామాల వైపు పరుగు తీశారు. అలా ఇతర ప్రదేశాల నుండి ప్రజలు తరలి వచ్చిన గ్రామం మోగలిపురం.గ్యాస్ లీకేజ్ బాధితులకి సహాయం చేయడానికి, నా మిత్రుడు, మా వీ హెల్ప్ సంస్థ సహ-వ్యవస్థాపకుడు ప్రదీప్ కుమార్ 11:45 కి నాకు ఫోన్ చేసాడు. మొగలిపురం గ్రామ సచవాల యం లో పని చేసే అతనికి ఆ రోజు చెక్ పోస్ట్ డ్యూటీ వేశారు. అతను స్థానిక వాలంటీర్ల తో కలిసి అక్కడ ఉండే గ్రామస్థులకి ఇంట్లోనే ఉండమని, పరిస్థితి గురించి అవగాహన కల్పిస్తున్నడు.ఈ విషయం గురించి తెలియగానే నేను హుటాహుటిన అక్కడికి చేరుకున్నాను. అప్పటికే ప్రదీప్ వారికి సహాయ చర్యలు మొదలుపెట్టాడు.ప్రజలు సహాయం కోసం వేచి చూడడం నేను గమనించాను.వారిలో కొంత మంది స్పృహ తప్పిపో యారు కూడా. అంతా గందరోళంగా ఉంది.
నేనూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొ న్నాను.ప్రజలు నీళ్ళ కోసం పరుగులు తీయడం మమ్మల్ని కలచివేసింది. దీంతో వాళ్ళ కోసం వాటర్ బాటిళ్లు, ఫ్రూట్ జ్యూస్ లు కొన్నాం.మా కాలేజీ యాజమాన్యం సహాయంతో దాదాపు 400 మందికి ఆహారం ఏర్పాటు చేయగలిగాం. పరిస్థితి కొంత వరకూ అదుపులోకి వచ్చింది. రాత్రి 8 ఆ ప్రాంతంలో పరిస్థితి సద్దు మనిగిందని అందరూ వాళ్ళ వాళ్ళ ఊర్లకి బయలుదేరారు. అనుకోని విధంగా అర్థ రాత్రి 12:30 కి, అదే కెమికల్ ప్లాంట్ లో మరో గ్యాస్ లీకేజ్ జరిగిందని వార్తలు వచ్చాయి.ఇంకో ప్రమాదం జరిగిందని, ప్రజలు ఇళ్ళలో నుంచి బయటికి పరుగులు తీస్తున్నారని మాకు ఫోన్లు వచ్చాయి. అధికారులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు.కాలేజీ బస్సు ఏర్పాటు చేసి కొంత మందిని బిట్స్ కి తరలించాము. కాలేజీ యామాన్యం పుణ్యమా అని దాదాపు 100 మందికి వసతి, ఆహారం ఏర్పాటు చేయగలిగాం. తరువాతి రోజు ఉదయానికి వారికి పాలు, టిఫిన్ సమకూర్చాం.
సాయంత్రానికి అన్నీ కుదురుకున్నాక వాళ్లందరినీ సురక్షితంగా వాళ్ళ ఊర్లకి పంపాం. రెండు మూడు రోజుల నుంచి వైజాగ్ లో జరిగిన పరిణామాలు ఇతర పరిశ్రమలకి ఒక హెచ్చరిక వంటివి.భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం నియమ నిబంధనలను కటినంగా అమలు చేయాలి.