“కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు అని తెలియగానే ఆశ్చర్యపోయాను. ఏప్రిల్ మొదటి వారంలో నా భార్యతో కలిసి విహార యాత్రకి వెళ్ళాలని అనుకున్నాను కానీ అంతా తల కిందులు అయ్యింది. ఇప్పుడు లాక్డౌన్ పొడిగించారు కాబట్టి, ఈ ప్లాన్స్ అన్నీ వాయిదా వేసుకోవాలి.మాములుగా నాకు పనితోనే సరిపోతుంది, ఇలాంటి కష్టసమయాల్లో నేను నా బాధ్యత నెరవేర్చడానికి మరింత కష్టపడాలి.
నేను పాలు అమ్మే కుటుంబాలతో నాకు ఉద్వేగపూరిత సంబంధం ఉంది. లాక్డౌన్ వల్ల జనాలు ఇళ్ళకే పరిమితం అయిపోయారు. వాళ్ళు నాలాగా బయటికి రాలేరు. ఒకవేళ నేను వాళ్ళకి పాలు పోయకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు, నాకది ఇష్టం లేదు.
ఈ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది చనిపోయారని, దేశంలో కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయని టీవీ ఛానళ్లలో చూపిస్తున్నారు కాబట్టి, నా భార్య నాకు జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. బయట పరిస్థితి ఎలా ఉందో నాకు తెలుసు, అందుకనే బయటకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటాను.20 నిమిషాలకొకసారి చేతులు కడుక్కుంటాను.పేస్ మాస్క్ పెట్టుకుంటాను, సామాజిక దూరం పాటిస్తాను. పని పూర్తిచేసుకుని ఇంటికొచ్చాక తప్పకుండా స్నానం చేస్తాను. పోలీస్ ఆఫీసర్లు కూడా నాకు సాయపడతారు. నాకు ఎంట్రీ పాస్ ఇచ్చారు, అప్పుడప్పుడూ నా ఆరోగ్యం గురించి అడుగుతూ ఉంటారు.మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మహమ్మారిని జయించాలంటే, ముందు జాగ్రత్త చర్యలు పాటించాల్సిందే.లాక్డౌన్ తరువాత కూడా కొన్ని నెలల పాటు ఈ అలవాట్లు కొనసాగించాలి. ఇవాల్టి నుంచి మనం ఈ మార్పులని అలవర్చుకోవాలి.”