“కరోనా మహమ్మారి మూలాన ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న షట్ డౌన్ విస్మయానికి గురి చేసిందనే చెప్పాలి.నిజానికి కొన్ని వారాలకే ఎంతో మార్పొచ్చింది.
ఒక్కసారిగా కౌగిలించుకోవడం, హ్యాండ్ షేక్ ఇవ్వడం ఇన్ఫెక్షన్ కి మార్గాలు గా మారాయి, నచ్చిన వాళ్ళకి దూరంగా ఉండడం ప్రేమకి చిహ్నంగా మారింది. దీని వల్ల ఒక విషయం తెలిసింది, ధనవంతులుగా ఉండటం, డబ్బు సంపాదించడం మాత్రమే జీవితం కాదు అని.సాధారణంగా మనం రోజువారీ పనులకే పరిమితం అవుతాం కానీ, ప్రకృతి శక్తి మాత్రమే అపరిమితమైనది.
ఈ లాక్డౌన్ మూలాన ఇంట్లో ఉండడం వల్ల నాకు ఒక విషయం తెలిసింది. కుటుంబం అంటే ఇంట్లో ఉండే వాళ్ళు మాత్రమే కాదు, ఈ చెట్లు, చేమలు, జంతువులు,పక్షులు, నేల, నింగి అన్నీ కూడా కుటుంబమే.ప్రపంచంలో మనం కూడా భాగమే. మనది వసుధైక కుటుంబం.
ప్రతిరోజునీ కొత్తగా మొదలుపెట్టడం ద్వారా, కేరింగ్ గ ఉండటమే మనం చేయగలిగింది.మన మీదే కాదు, మన కుటుంబం పట్ల, మన చుట్టూ ఉండే జీవజాలం పట్ల, ప్రకృతి పట్ల చూపించాలి. మనం పీల్చే గాలి, మన మీద పడే సూర్యకాంతి కూడా ఇందులో మిళితం అయ్యి ఉంది.
ప్రతి జీవి బాగోగులకోసం ప్రకృతి కష్టపడుతుంది.తీసుకున్న దానికి ప్రతిఫలం చూపడానికి ఇదే మంచి తరుణం.చెప్పడం చాలా తేలిక చేయడమే కష్టం. కనీసం ఇప్పటి నుంచైనా ప్రకృతిని కాపాడుకుందాం. ఇప్పుడు మనం అనుభవించేది ప్రకృతి మనకి నేర్పిన పాఠమే.చిన్న చిన్న విషయాలను ఆస్వాదించమని దీని సారాంశం.”