“ఈ కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థని, మానవాళిని తలకిందులు చేసింది.
నేను సామాన్లు కొనాలన్నా, షాపింగ్ చేయాలన్నా సూపర్ మార్కెట్స్ లేదా మాల్స్ కి వెళ్తాను ఎందుకంటే అన్నీ ఒకేచోట దొరుకుతాయి కాబట్టి. ఇప్పుడే మనం ఒక సమాజం లాగా ఈ మహమ్మారిని ఎలా ఎదురుకోవాలో అని ఆలోచించాలి. మనం కొనే వస్తువుల మీదనే ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. ఇలాంటి కష్ట సమయాల్లో మన వంతు సాయంగా మనం కూడా సాయపడాలి. ఈ పరిస్థితుల వల్ల చిన్న కారు వ్యాపారుల, రోజు వారీ సంపాదించేవాళ్ళు బాగా నష్టపోతారు.మనం వాళ్ళకి బాసటగా నిలవాలి.మనం పూనుకుంటే రోడ్డు మీద కూరగాయలు అమ్మేవాళ్ళు, చిన్న కిరానా కొట్లు, పచారీ కొట్లు, మెడికల్ షాపులు మళ్ళీ పుంజుకుంటాయి.మాల్స్ లో కాకుండా పిండి కోసం పిండి గిర్నీలకి వెళదాం
ఇలాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు మనం అందరం కష్టపడతాం.ఇక్కడ మనం పెద్ద మొత్తంలో కొంటే మాల్స్ లో దొరికినట్టు భారీ డిస్కౌంట్ లభించకపోవచ్చు. బయట కొనాలంటే కొద్దిగా కష్టంగా ఉండొచ్చు ఎందుకంటే అక్కడ ఎండలో నుంచుని కొనాల్సి వస్తుంది. అదే మాల్స్ లో ఐతే వెసలుబాటుగా, ఏసీ వేసి హాయిగా ఉంటుంది. సామాజిక దూరం వంటి ప్రమాణాలను పాటిస్తూ చిన్న దుకాణాల దగ్గర కొనాల్సిన సమయం ఆసన్నమయింది. ఇలాంటి చిన్నకారు వ్యాపారాలను ప్రోత్సహించడానికి మా కుటుంబం ఇలాంటి నిర్ణయాలను తీసుకుంది. ఈ రోజే ఈ మార్పు వైపు అడుగులు వేద్దాం!”