“నాకు ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా చెయ్యాలి అనిపిస్తుంది, లేదంటే బోర్ కొడుతుంది.
ఇంతకు ముందు, నాకు స్కూల్ కి వెళ్ళడమంటే అంత నచ్చేది కాదు ఎందుకంటే నాకు మాథ్స్ అంటే పడదు.కానీ ఈ మధ్య స్కూల్ ని బాగా మిస్ అవుతున్నా. నేను స్నేహితులని, ప్లే గ్రౌండ్ ని, టీచర్స్ ని, జామకాయలు అమ్మే అంకుల్ ని మిస్ అవుతున్నా. స్కూల్ కి వెళ్ళక దాదాపు నెల రోజులు అయ్యింది, వాళ్లందరినీ చూడాలి అనిపిస్తుంది . ఈ లాక్డౌన్ వల్ల నేను బయటికి వెళ్ళి, స్నేహితులతో ఆడుకోలేకపోతున్నా.
ఆడుకోడానికి ఎవరూ లేరు కాబట్టి, నేను కంప్యూటర్ లో మైన్ క్రాఫ్ట్, రాకెట్ లీగ్ గేమ్స్ ఆడుకుంటా.కొంచం సేపు తరువాత అది కూడా బోర్ కొడుతుంది.
జూన్ వరకూ స్కూల్ కి వెళ్ళేది లేదు కాబట్టి, మా అమ్మా నాన్న నన్ను ఒక షెడ్యూల్ ప్రకారం నడుచుకోమంటున్నారు. నాకు ఈ షెడ్యూల్ అవీ అలవాటు లేదు కాబట్టి, కొన్ని కొన్ని సార్లు షెడ్యూల్ ప్రకారం ఏం చేయాలో కూడా మర్చిపోతుంటాను. అందుకని నేను చేయాల్సిన పనులన్నీ రాసుకోవడం అలవాటు చేసారు నాన్న. ఆక్టివ్ గా ఉండకపోవడం, ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల కళ్ళకి, నడుముకి ప్రాబ్లమ్ నాన్న చెప్పారు.
అందుకని నా షెడ్యూల్స్ ని మార్చుకున్నాను, వాటిని ఫాలో అవుతాను.వేసవి సెలవులకి మా టీచర్ ఇచ్చిన అసైన్మెంట్స్ ని పూర్తిచేస్తాను, స్నేహితులకి వీడియో కాల్స్ చేసి మాట్లాడుతూ ఉంటాను. మా నాన్నతో కలిసి మెడిటేషన్ చేయడం కూడా మొదలుపెట్టాను. నాకు బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం, ఇప్పుడు అదే చేస్తున్నాను. ఖాళీ సమయాల్లో, సినిమాలు చూస్తాను, వీడియో గేమ్స్ ఆడతాను. రాత్రి తొందరగా నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాను!”