“నేనొక బిజీ ఎలక్టీషియన్ ని. కస్టమర్ల ఇంట్లో కరెంట్ కష్టాలు ఉంటే నాకే ఫోన్ చేస్తారు కాబట్టి, నా ఫోన్ ఎప్పుడూ మోగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఒక కస్టమర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సింది కానీ, ఈ టీ కొట్టు కనపడితే చాలు నన్ను నేను ఆపుకోలేను. ఇక్కడ ఆగి టీ తాగుతూ, న్యూస్ పేపర్ చదవాల్సిందే. రోజుని ఇలా ప్రారంభించడమే నాకు ఇష్టం. మన చుట్టూ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ద్వారా రోజుని ప్రారంభించడానికి ప్రేరణ లభిస్తుంది. దీని వల్ల సాయంత్రం నా పని అయ్యాక నా కొడుక్కి ఈ విషయాలు అన్నీ చెప్పగలను. నిజం చెప్పాలంటే, బయట టీ తాగడానికి ఇదొక సాకు మాత్రమే. టీ అనేది పానీయం మాత్రమే కాదు ఒక భావం.”