“ఎదిగేటప్పుడు నేను ఎప్పుడూ ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్ళడం కంటే ఇంట్లో ఉండటానికే ఎక్కువ ఇష్టపడేవాడ్ని. కానీ నేను మా నాన్నమ్మ ఇంటికి ఇంటికి వెళ్ళినప్పుడల్లా, ఆమె మా అందరి మీదా ప్రేమతో ఇష్టంగా వంట చేయడం గమనించాను. నేను మా నాన్నమ్మ పక్కన కూర్చుని కొత్త కొత్త వంటలు నేర్చుకునేవాడ్ని. అప్పటి నుంచి, వంట మీద నాకు మక్కువ పెరిగింది. ఇప్పుడు వంటి నాకు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నాకు ఎప్పుడయినా బాధగా అనిపిస్తే, వంట చేస్తూ నా భావోద్వేగాలను మళ్లిస్తూ ఉంటాను. వంటనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్య భాగం అయినప్పటికీ, అబ్బాయి అయ్యుండి వంట చేయడం ఏంటని ఇప్పటికీ సలహాలు ఇస్తుంటారు. వంట చేయడం మగ వాళ్ళ పని కాదని చెప్తారు. నాకు ఎవరైనా ఇలాంటి సలహాలు ఇస్తే, నేను వాళ్ళకి కఠినంగానే సమాధానం ఇస్తాను. ఈ కాలంలో వంటనేది మగవాళ్ళకి ఎంత ముఖ్యమో ఆడవాళ్ళకి కూడా అంటే ముఖ్యం. మొదట్లో కొంచం కష్టంగా ఉన్నా, ఇప్పుడు పరిస్థితి బాగానే ఉంది. నేను వంట చేసినప్పుడల్లా, మా స్నేహితులు నా వంటని మెచ్చుకుంటారు. అది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది.”