“నేను పుట్టింది, పెరిగింది అంతా గుంటూరు జిలాల్లో. నేను ఒక మంచి విశ్వవిద్యాలయం నుంచి బికామ్ డిగ్రీ పొందాను. నేను చాలా పేద నేపధ్యం నుంచి వచ్చాను. మా నాన్న గారు ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి. నా చదువు అయిపోయాక, మేము విజయవాడ కి మకాం మార్చాము. మొదట్లో మా తల్లిదండ్రులు నా చదువుకి సాయం చేసినా, రాను రాను ఖర్చులు పెరగడంతో వాళ్ళు అంత ఉత్సుకత చూపలేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య, నేను ఎం.బి.ఏ చేయాలనే నా కలని వదులుకున్నా.
నేను ఓసి కాబట్టి, మాకు స్కాలర్షిప్ కూడా దొరకదు. ఒక వేళ నేను ఎం.బి.ఏ చేసుంటే నేను ఏదో ఒక బహుళ జాతి సంస్థ కి సి.ఈ.ఓ గా పని చేస్తూ ఉండేవాడిని, లేదా సొంతంగా ఒక బహుళ జాతి సంస్థ ని నెలకొల్పేవాడ్ని. ఎప్పటికైనా క్రికెటర్ అవ్వాలని కల ఉండేది.
జీవితం అలా గడిచిపోయింది. ఎన్నో ఉద్యోగాలు చేశాక, నేను ఒక ఫైనాన్స్ సంస్థలో 3000 ఉద్యోగానికి చేరాను, ఒక ట్రాన్స్ఫర్ తరువాత అది 10,000 అయ్యింది. అప్పట్లో అది చాలా ఎక్కువ.
ఎప్పటికి కూడా, నాకు మా పిల్లలకి నచ్చిన రంగాల్లో చదివించేంత స్తోమత లేదు. నాకు, మా కుటుంబానికి మంచి జీవితాన్ని ఇవ్వడానికి నేను ఈ రోజుకి కూడా బాగా కష్టపడతాను. ఇప్పుడు నేను చేయగలిగిందల్లా, జీవితం లో వచ్చే కొత్త మార్పుల కోసం ఎదురుచూడటమే.”