“మాది ఉత్తర్ ప్రదేశ్. పని కోసం నేను కడపకి వచ్చాను, మా తల్లిదండ్రులు, చెల్లెలు అక్కడే ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చి 8 సంవత్సరాలు అయ్యింది. అందుకే సెలవు దొరికినప్పుడల్లా నేను మా ఊరు వెళ్తాను. అప్పట్లో, సెలవులొస్తే మా కుటుంబంతోనే గడిపేవాడిని. కానీ పని చేయడం మొదలుపెట్టాక, ఇంతకు ముందులా సెలవులు గడపలేకపోతున్నాను. నా పరిస్థితి గమనించాక, వాళ్ళకి కుదిరినప్పుడు వాళ్ళే ఇక్కడికి వస్తారు. నేను ఈసారి దీపావళికి ఇంటికి వెళ్ళట్లేదు ఎందుకంటే, మా చెల్లి పెళ్లి కోసం సెలవులు కావాలి కదా. అందుకే దీపావళికి మా ఇంట్లో వాళ్ళే ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ రెండు రోజులు ఉంటారు కాబట్టి, బయిట లంచ్ చేసి, సాయంత్రం దీపావళి జరుపుకోవడానికి నిశ్చయించుకున్నాం. మా చెల్లికి ఏం బహుమతి ఇవ్వాలా అని ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నాను. అమ్మ చేతి స్వీట్లు తినడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ఇంటికి వెళ్లలేకపోయినందుకు నాకేమీ బాధ లేదు. మా కుటుంబంతో ఉన్నప్పుడు ఎక్కడున్నా ఇల్లు లాగే అనిపిస్తుంది.”
![](https://humansofandhra.org/wp-content/uploads/2019/10/75477004_678950049260841_1328377743683581273_n.jpg)