“దాదాపు నెల రోజుల తరువాత నన్ను చూస్తే నా కూతురు ఆనందానికి అవధులుండవు.. నేను విజయవాడ లోని ఒక చిన్న ఫ్యాక్టరీలో పనిచేస్తాను. ఆ ఫ్యాక్టరీ మా ఊరికి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. నా కుటుంబాన్ని నేను మిస్ అవుతాను. కానీ,ఇల్లు గడవడం కోసం కష్టపడి పనిచేయడం తప్ప నాకు వేరే మార్గాంతరం లేదు. నేను ఇంటికొచ్చిన ప్రతిసారి నా కూతురు నన్ను చాలా ప్రశ్నలు అడుగుతుంది. నేను చేసే పని గురించి తను పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటుంది. నాకు ఇది ఎంతో ప్రేరణనిస్తుంది ఎందుకంటే నేను ఎప్పుడూ తనకి ఏదైనా ఉత్తేజపరిచే విషయాన్ని చెప్పాలని అనుకుంటాను. ఈ దీపావళికి నా భార్యని, కూతురిని ఆశ్చర్యపరచడం కోసం నేను ఇక్కడ ఓవర్ టైం పనిచేస్తున్నాను. ఏడూ రోజులు ఆగితే మా ఊరికి బోలెడు టపాసులు, కొత్త బట్టలతో వెళ్తాను.”