“నేను 25 సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్నాను. ఇదే నా బ్రతుకుదెరువు. రోజూ వచ్చే దానికంటే వినియోగదారులు ఒక్కోసారి ఎక్కువ వస్తారు ఒక్కోసారి తక్కువ వస్తారు. అందువల్ల నేను పెద్దగా బాధపడను. ఎందుకంటే, నేను ఎంత నష్టపోయానో లెక్కపెడుతూ కూర్చుంటే నేను ఎప్పటికీ సంతోషంగా ఉండలేను. నాకు బంగారం లాంటి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వాళ్ళకంటూ ఒక సొంత వ్యక్తిత్వం, స్వభావం ఉంది కాబట్టి వాళ్ళు ఎదిగేటప్పుడు ఇంట్లో ఎప్పుడూ అరుపులూ, గొడవలూ ఉండేవి. వాళ్ళ మధ్య ఎంతో ప్రేమ, స్నేహం ఉంది. వాళ్ళు ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవడం చూస్తే మనసుకి హాయిగా ఉంటుంది. వాళ్ళు ముగ్గురూ ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు. ఒకమ్మాయికి పెళ్లి అయ్యింది, మిగిలిన ఇద్దరు చదువుకుంటున్నారు. నేను చేసేది చిన్న వ్యాపారమే కావచ్చు, కానీ నా కూతుళ్లు మంచి స్థాయిలో ఉండేలా చూసుకుంటాను. మా ఇంటికి అందం, అలంకారం వాళ్ళే. నా కూతుళ్లు జీవితంలో స్థిరపడే దాకా నా శాయశక్తులా నేను కష్టపడతాను. ఇది నేను చేసే వాగ్దానం.